గుండెల్లో గోదారి ఆలస్యానికి కారణం అదేనా??

గుండెల్లో గోదారి ఆలస్యానికి కారణం అదేనా??

Published on Dec 28, 2012 11:30 AM IST

Gundello-Godari
లక్ష్మి మంచు రాబోతున్న చిత్రం “గుండెల్లో గోదారి” ఈపాటికే విడుదల అవ్వాల్సింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించలేదు. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. “మరందేన్ మన్నితేన్” అన్న పేరుతో అక్కడ రానున్న ఈ చిత్రానికి అక్కడ సెన్సార్ వారు “U” సర్టిఫికేట్ బహుకరించారు. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చెయ్యాలని నిర్మాత అనుకోవడం మూలాన ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతుంది. ఈ చిత్రం మొదటి కాపీ రెడీ అయిన రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద తమిళంలో కాని తెలుగులో కాని ఏదో ఒక పెద్ద చిత్రం విడుదల అవుతూ వచ్చింది. దీనివలన “గుండెల్లో గోదారి” చిత్రానికి కావలసినన్ని ధియేటర్ లు దొరకకపోవడంతో విడుదల ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే ఈ చిత్రం జనవరి ద్వితియార్ధంలో విడుదల కానుంది. ఆది లక్ష్మి మంచు, సందీప్ కిషన్, తాప్సీ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మించారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించారు.

తాజా వార్తలు