‘మాస్ జాతర’ కి అసలు టెస్ట్ మొదలు!

‘మాస్ జాతర’ కి అసలు టెస్ట్ మొదలు!

Published on Nov 3, 2025 12:00 AM IST

Mass-Jathara

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే మాస్ జాతర. పలు వాయిదాలు అనంతరం వచ్చిన ఈ సినిమా మంచి ప్రీమియర్స్ ఇంకా వీకెండ్ లో కూడా డీసెంట్ బుకింగ్స్ తో రాణించింది. కానీ ఈ సినిమాకి అసలు టెస్ట్ ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పాలి.

ఈ సోమవారం వసూళ్లు బుకింగ్స్ తోనే మాస్ జాతర అసలు స్టామినా బయటపడుతుంది. మరి ఈ టెస్ట్ ని సినిమా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు