నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?

నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?

Published on Sep 4, 2025 4:02 PM IST

The-Raja-Saab
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ ట్రీట్ ని వచ్చే ఏడాదికి లాక్ చేశారు. ఇక ఈ సినిమాపై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి.

దీని ప్రకారం రాజా సాబ్ నైజాం మార్కెట్ డీల్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు భారీ మొత్తంతో డీల్ ని పూర్తి చేసుకున్నట్టుగా ఇపుడు టాక్. సో నైజాం మార్కెట్ లో రాజు గారు ల్యాండ్ అవ్వడానికి అంతా రెడీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు