స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క పవర్‌ఫుల్ మాస్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరించేందుకు సిద్ధమైంది.
కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనుష్క సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆడియో ప్రమోషన్స్‌తో అనుష్క ఘాటి చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తోంది. తాజాగా ఘాటి చిత్ర ప్రమోషన్స్ కోసం శీలావతి ఏకంగా పుష్పరాజ్‌ను పట్టుకొచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అనుష్క చేసిన ఆడియో ప్రమోషన్ తాజాగా మేకర్స్ రివీల్ చేశారు.
అనుష్క, బన్నీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అదిరిపోయే రీతిలో ఉండటం.. దీని ద్వారా ఘాటి చిత్ర ప్రమోషన్స్‌కు సరికొత్త ఊపు లభించింది. ఇక అల్లు అర్జున్ అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పుడున్న జనరేషన్‌లో అనుష్క మాత్రమే స్టార్ హీరోల మాదిరిగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఆడియెన్స్‌ను రప్పించగలదని.. ఘాటి సినిమాలో శీలావతి కూడా అరుంధతి, భాగమతి, రుద్రమదేవి తరహా పాత్రలాగా మంచి గుర్తింపు తీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్ చేసిన ఈ ఆడియో ప్రమోషన్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండటంతో ఘాటి సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ అవుతోంది.