శృతి హాసన్ లో సంగీతం కోణం

శృతి హాసన్ లో సంగీతం కోణం

Published on Sep 26, 2012 8:46 AM IST


శృతి హాసన్ సూపర్ స్టార్ కూతురిగా కాకుండా తన అందం మరియు ప్రతిభతో తనకంటూ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె మంచి గాయిని ఈ విషయం చాలా మంది అభిమానులకు తెలుసు కాని ఆమెలో సంగీత కోణం గురించి చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి ఆమెను అడుగగా “నేను కాలిఫోర్నియాలో సంగీతం నేర్చుకున్నాను కాని నేను అక్కడ కన్నా ఎక్కువగా మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. “ఈనాడు” చిత్రానికి సంగీతం అందించడం నిజానికి నాకు చాలా పెద్ద విషయం కాని మా నాన్న నన్ను పక్కనుండి ప్రోత్సహించారు” అని అన్నారు.

“ఒక సూపర్ స్టార్ కూతురు కాబట్టి ఇటు పరిశ్రమ అటు ప్రేక్షకులు నేను చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు ఆ విషయాన్నీ నేను దృష్టిలో పెట్టుకుని ఉంటాను. “ఈనాడు” చిత్రం కోసం రికార్డింగ్ జరిపే సమయంలో అయన అప్పుడప్పుడు వచ్చి ఎటువంటి సంగీతం కావాలి అని చెబుతుండేవారు. ఆ సమయంలో ఎప్పుడు నేను ఆయన్ని “డాడ్” అని పిలవలేదు “సార్” అని పిలిచేదాన్ని. అయన కూడా నన్ను కూతురిగా కాకుండా సంగీత దర్శకురాలిగానే చూశారు”

“నాయక్” లో ఒక పాట పాడుతున్నట్టు వచ్చిన పుకార్లను ఆమె ఖండించింది హిందీలో ప్రభు దేవ దర్శకత్వంలో మరియు రవి తేజ సరసన “బలుపు” చిత్రంలో నటిస్తున్నానని దృవీకరించారు. తండ్రి లానే శృతి కూడా మల్టీ టాలెంటడ్ కదూ.

తాజా వార్తలు