విక్టరీ వెంకటేష్ తన సినిమా ‘నారప్ప’ సినిమా ఫస్ట్ కాపీ పూర్తి అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం వెంకీ డబ్బింగ్ కూడా పూర్తి చేశాడట. అయితే ఈ సినిమా ప్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం వెంకీ చేసిన రిస్కీ స్టంట్స్ అద్భుతంగా వచ్చాయట. కాగా ఈ సీక్వెన్స్ సీన్స్ సినిమాలోనే కీలకమైనవి. ఇక ఈ చిత్రంలోని వెంకీ లుక్ కి అలాగే రీసెంట్ వెంకీ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసిన చిన్న వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు. కాగా తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది.