తారక్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు అదే టైటిల్.?

తారక్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు అదే టైటిల్.?

Published on Jun 11, 2020 9:04 PM IST


మన తెలుగులో విపరీతమైన మాస్ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అలాంటి ఎన్టీఆర్ తో “కేజీయఫ్” లాంటి మాస్ ఫీస్ట్ ను ఇండియన్ ఇండస్ట్రీకు అందించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నారని చిన్న బజ్ రావడంతోనే విపరీతమైన హైప్ వచ్చింది.

ఆ బజ్ కూడా ఈ మధ్యనే కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ చిత్రం మొదలు కావడానికి ఇంకా చాలా సమయమే ఉన్నా పలు ఆసక్తికర విషయాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వీరు హింట్ ఇస్తూ వస్తున్న పదాన్నే టైటిల్ గా పెట్టనున్నారని తెలుస్తుంది, అదే “న్యూక్లియర్”.

ఈ పదాన్ని ప్రశాంత్ నీల్ ఇప్పటికే సోషల్ మీడియాలో తారక్ ను ఉద్దేశించి వేసిన ట్వీట్లలో ప్రస్తావించారు. దానినే లేదా అందుకు దగ్గరగా ఉండే మరో పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టడం ఖాయం అని మరో కోసం కూడా వినిపిస్తుంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ కు ఎలాంటి టైటిల్ పెడతారో అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు