‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?

‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?

Published on Jul 27, 2025 10:35 AM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “కింగ్డమ్”. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చేసింది. దీనితో మరింత పాజిటివ్ హైప్ నమోదు కాగా ఈ ట్రైలర్ లో ఒక సర్ప్రైజింగ్ పాత్ర ఆసక్తిగా మారింది.

ఇందులో కనిపించిన సన్నివేశాల్లో బాణాలు పట్టుకొని ఒక తెగ కనిపిస్తున్నారు. వారికి ఒక నాయకుడు కూడా కనిపిస్తున్నాడు. మరి ఆ నాయకుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే అది ఎవరో వేరే నటుడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ అది కూడా విజయ్ దేవరకొండే అన్నట్టు మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు