‘థామా’ కళ్లుచెదిరే ఫస్ట్ డే కలెక్షన్స్

Thamma

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘థామా’ సినిమా అక్టోబర్ 21న భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రానికి ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు. హిందీ వెర్షన్‌కు మంచి రివ్యూలు రావడంతో, సినిమా బలమైన ఓపెనింగ్స్ సాధించింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘థామా’ రూ.25.11 కోట్లు (నెట్) వసూలు చేసి, ఆ ఫ్రాంచైజ్‌లో ‘స్త్రీ 2’ తర్వాత రెండవ అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థకు కూడా ఇది ‘స్త్రీ 2’ మరియు ‘ఛావా’ తర్వాత మూడవ అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డ్ సృష్టించింది.

ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లో ఇది అత్యంత పెద్ద ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన చిత్రం. రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేష్ రావల్, ఫైజల్ మాలిక్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించగా, సంగీతం సచిన్-జిగర్ అందించారు.

Exit mobile version