మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 15ఏళ్ళు దాటిపోయింది. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో పాతుకుపోయిన అతి కొద్దిమంది హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరూ స్టార్ హీరోలతో తమన్నా నటించేసింది. ఇప్పటికీ అడపాదడపా పరిశ్రమలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. తమన్నా ఏజ్ 30కి చేరుకుంది. ఐనప్పటికే ఆమె పెళ్లిమాట ఎత్తడం లేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. ఒక వేళ మీకోసం స్వయంవరం ఏర్పాటు చేస్తే ఏ ముగ్గురు హీరోలు స్వయంవరానికి రావాలని కోరుకుంటారు అని అడుగగా ఆమె విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్ అని టక్కున చెప్పేసింది. టాలీవుడ్ నుండి ఆమె ప్రభాస్ ని ఎంచుకోవడం విశేషం. వీరిద్దరూ కలిసి రెబల్, బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు చేయడం జరిగింది.