మాస్ మహారాజ రవితేజ హీరోగా, బాబీ డైరెక్టర్ గా మొదలుకానున్న కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని ముందుగా వైవిఎస్ చౌదరి నిర్మించాలి కానీ ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కన్నడలో బాగా ఫేమస్ అయిన రాక లైన్ వెంకటేష్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలని చేపట్టారు.
థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అమ్పోజ్ చేస్తున్నాడు. థమన్ ఇప్పటికే ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం మొదలు పెట్టాడు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. చాలా ఫ్లాపుల తర్వాత రవితేజ ఈ సంవత్సరం బలుపు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రవితేజ చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. రవితేజ ‘బలుపు’ సినిమాకి స్క్రిప్ట్ అందించిన బాబీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.