రెబల్ నుండి తప్పుకున్న తమన్!

రెబల్ నుండి తప్పుకున్న తమన్!

Published on Feb 4, 2012 10:13 AM IST

గతం లో “రెబల్” చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు అని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నుండి తమన్ తప్పుకున్నారు. లారెన్స్ గత చిత్రం “కాంచన” చిత్రానికి సంగీతం అందించిన తమన్ ట్విట్టర్ లో ఈ విధంగా చెప్పారు ” సంగీత దర్శకుడు లారెన్స్ కి నా శుభాకాంక్షలు మరియు మొత్తం రెబల్ చిత్ర బృందానికి కూడా నా శుభాకాంక్షలు “కాంచన” చిత్రానికి సంగీతం చేసే అవకాశం ఇచ్చిన లారెన్స్ గారికి నా కృతజ్ఞతలు నేను “రెబల్” చిత్రం నుండి అధికారికంగా తప్పుకుంటున్నాను” అని చెప్పారు. గతం లో ఈ చిత్రానికి కథానాయికగా అనుష్కని అనుకున్నారు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తరువాత అనుష్క తప్పుకుంది ఆ స్థానం లో తమన్నాను తీసుకున్నారు ఇప్పుడు పలు కారణాల వల్ల తమన్ కూడా తప్పుకున్నారు వేసవి లో విడుదల కానున్న ఈ చిత్ర బృందం లో ఎటువంటి మార్పులు జరగబోతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు