మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను అలరిస్తోంది.
పక్కా మాస్ ట్రీట్‌తో రాబోతున్న ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే, అదే రోజు ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం రిలీజ్ అవుతుండటంతో ‘మాస్ జాతర’ను ఒక రోజు వెనక్కి జరిపి నవంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అక్టోబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.


