టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో హీరో అడివి శేష్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’ కూడా ఒకటి. ఈ సినిమాను షానీల్ డియో డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ను పలుమార్లు మారుస్తూ వచ్చారు. ఇక చివరగా క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ, ఇప్పటికే క్రిస్మస్ బరిలో చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ను లాక్ చేసుకున్నాయి. దీనికి తోడు డెకాయిట్ చిత్రానికి సంబంధించిన కొన్ని పనులు కూడా బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ మారుతుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు మేకర్స్ నుండి కూడా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. డెకాయిట్ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ను అక్టోబర్ 28న మధ్యాహ్నం 1.08 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాలో అడివి శేష్ పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు.



