ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

Published on Oct 27, 2025 8:13 PM IST

Mass Jathara

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఊరమాస్ ట్రీట్ అందించింది. మాస్ అంశాలు ఈ ట్రైలర్‌లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. మాస్ రాజా స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచాయి. రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన పర్ఫార్మెన్స్‌తో కుమ్మేశాడు. కామెడీ డోస్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ ట్రైలర్ కట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల గ్లామర్ మరోసారి ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నవీన్ చంద్ర పవర్‌ఫుల్ విలన్‌గా ఈ సినిమాలో నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మొత్తానికి ‘మాస్ జాతర’ ట్రైలర్‌తో ఊరమాస్ అంచనాలు పెంచాడు రవితేజ. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు