ఆ గిఫ్ట్ లైఫ్ టైం అచీవ్ మెంట్ కన్నా గొప్పది – థమన్

ఆ గిఫ్ట్ లైఫ్ టైం అచీవ్ మెంట్ కన్నా గొప్పది – థమన్

Published on Sep 22, 2013 5:50 PM IST

Thaman's-gift
ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో బాగా బిజీ బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సంవత్సరం ఇప్పటికే 12 సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆయన రీసెంట్ గా మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో రెండు రోజుల క్రితమే విడుదలైంది.

ప్రస్తుతం థమన్ 100 సంవత్సరాల సినిమా వేడుకల్లో పాల్గొనడానికి చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు థమన్ ఎన్నడు లేనత హ్యాపీ గా ఉన్నాడు. విషయం ఏమిటంటే క్రేజీ డ్రమ్మర్ మరియు థమన్ కి గురువైన శివమణి ప్రత్యేకమైన డ్రమ్ స్టిక్స్ ని థమన్ కి బహుకరించాడు.దాంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన థమన్ ఈ డ్రమ్ స్టిక్స్ నాకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు కన్నా గొప్పది అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు