పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్న సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఫస్ట్ సింగిల్ “మగువా మగువ” పాటకు అయితే భారీ రెస్పాన్స్ లు అందుకున్నాయి.
మరి అలాగే ఎప్పటి నుంచో ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ కోసం పవన్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపైనే అన్నట్టుగా థమన్ ఇచ్చిన హింట్ ఆసక్తి రేపుతోంది. వచ్చే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజుపై జస్ట్ డేట్ మాత్రమే పోస్ట్ చేసాడు. దీనితో ఇది వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ పైనే అన్నట్టుగా అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఆ అప్డేట్ అదేనా లేక వేరే ఏమన్నా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
#FEB14th ♥️
— thaman S (@MusicThaman) February 6, 2021