పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన పవన్ బర్త్ డే గ్లింప్స్ లో క్రేజీ ట్రాక్ ఇప్పుడు ఆడియెన్స్ ని ఊపేస్తోంది. థమన్ ఇచ్చిన స్కోర్ నెక్స్ట్ లెవల్లో హిట్ కాగా ఇది ఈ గ్లింప్స్ లో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై గట్టి హైప్ అందించింది.
మరి ఈ స్మూత్ ట్రాక్ పై థమన్ ఒక ఊహించని క్రేజీ అప్డేట్ ని అందించాడు. మరి ఈ ఫుల్ ట్రాక్ మొత్తం 4 నిమిషాల 14 సెకండ్ల పాటు ఉంటుంది అని ఫీస్ట్ అప్డేట్ అందించాడు. దీనితో ఈ ఓజి వర్సెస్ ఓమి ట్రాక్ కోసం ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.