దేవిశ్రీ-థమన్ మధ్య మళ్ళీ యుద్ధం తప్పేలా లేదే..!

దేవిశ్రీ-థమన్ మధ్య మళ్ళీ యుద్ధం తప్పేలా లేదే..!

Published on Apr 12, 2020 3:00 AM IST

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు థమన్ మరియు దేవిశ్రీ. ఈ సంక్రాంతికి వీరిద్దరూ మ్యూజిక్ అందించిన సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురంలో బాక్సాఫేస్ వద్ద పోటీ పడ్డాయి. మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందించగా, త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రానికి థమన్ సంగీతం అందించడం జరిగింది. కాగా అల వైకుంఠపురంలో మూవీకి గాను థమన్ అందించిన సంగీతం బిగ్ సక్సెస్ అయ్యింది.

కాగా వీరిద్దరూ మరోమారు బాక్సాఫీస్ వద్ద పోటీపడే అవకాశం కనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న తన 20వ చిత్రం పుష్ప 2021 సమ్మర్ లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల మూవీ కూడా 2021 ఏప్రిల్ కి విడుదల కానుంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తుంది. కాబట్టి దేవిశ్రీ, థమన్ 2021 సమ్మర్ లో మళ్ళీ పోటీపడే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు