‘కాంతార 1’ కోసం వార్ 2, మదరాసి నటులు!

‘కాంతార 1’ కోసం వార్ 2, మదరాసి నటులు!

Published on Sep 20, 2025 1:00 PM IST

Kantharachapter-1

ప్రస్తుతం కన్నడ సినిమా నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కాంతార ప్రీక్వెల్ సినిమానే అని చెప్పాలి. నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా తాలూకా ట్రైలర్ కి మేకర్స్ రిలీజ్ డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ సాలిడ్ న్యూస్ లు ఇపుడు అందించారు. బాలీవుడ్ నుంచి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తమిళ్ నుంచి రీసెంట్ మదరాసి నటుడు శివ కార్తికేయన్ లు ఈ సినిమా తాలూకా హిందీ, ఇంకా తమిళ ట్రైలర్ లని ఈ సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు