పలువిధాలుగా ఈ 2014లో జరగనున్న రాష్ట్రఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు కీలకంకానున్నాయి. ఈ టైంలో మన రాష్ట్రం రెండుగా విడిపోయి తమ తమ సొంత గూటికి చేరనున్నాయా అన్నది ఆసక్తికరమైన అంశం. ఈ ఎన్నికలు ఫిలిం ఇండస్ట్రీకు సైతం చాలా కీలకం కానున్నాయి
2013 ఎన్నికల అభ్యర్ధులలో మనం సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులను చూడచ్చు. ప్రస్తుతానికి చిరంజీవి ఎం.ఎల్.ఏ మరియు మినిస్టర్ హోదాలో వున్నాడు. తెలుగుదేశం పార్టీ నుండి నందమూరి బాలకృష్ణ ఎన్నికల భరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగావున్నాయి. మునుపటితరం నటుడు మురళిమోహన్ సైతం రాజమండ్రి తరపున టి.డి.పిలో బరిలోనికి దిగనున్నారు
వి.వి వినాయక్ రాజమండ్రి నియోజికవర్గం ద్వారా నిలబడనున్నారన్న వార్త వినిపిస్తుంది, అయితే ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హైదరాబాద్ కు చెందినంతవరకూ నటుడు శ్రీహరికి కాంగ్రెస్ తరపున టికెట్ లభించనుందని సమాచారం. వై.ఎస్.ఆర్.సి.పి లో ఇప్పటికే పూరి జగన్ తమ్ముడు పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు అన్న విషయం తెలిసినదే
వీరే కాక మరికొంతమంది నిర్మాతలు, నటులు ఈ ఎలక్షన్ల ద్వారా రాజకీయ ప్రవేశం చెయ్యనున్నారు. మరి ఈ 2014 ఎన్నికలు టాలీవుడ్ కు ఖచ్చితంగా ప్రాముఖ్యంగా నిలవనున్నాయని సమాచారం