‘థగ్ లైఫ్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా!?

‘థగ్ లైఫ్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా!?

Published on Jun 15, 2025 11:06 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలయికలో వచ్చిన నాయకుడు సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమాని ఫ్యాన్స్ ఆశిస్తే అందుకు భిన్నంగా నిరాశపరిచే సినిమాని “థగ్ లైఫ్” గా అందించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే పెద్ద ఎత్తున డ్రాప్ ని చూడాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా ఇలా థియేటర్స్ లోకి వచ్చిన వెంటనే ఓటిటి రిలీజ్ కోసం కూడా చర్చ మొదలైంది.

ముందు ఈ సినిమాని కేవలం 8 వారాలు తర్వాత మాత్రమే విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. కానీ ఫలితం బెడిసికొట్టడంతో ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ముందే తీసుకొస్తుంది అని టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా అయితే రిలీజ్ డేట్ పై కొత్త బజ్ వినిపిస్తుంది. దీనితో థగ్ లైఫ్ చిత్రం ఈ జూన్ 27 లేదా జూలై 4న ముందుగా దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చేస్తుంది అని తెలుస్తుంది. ఇక హిందీ వెర్షన్ ని జూలై 31కి ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు