నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు స్టేట్స్ నుంచి యూఎస్ మార్కెట్ వరకు హిట్ 3 భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఇప్పటికీ బాగానే కొనసాగుతుండగా ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఈ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రానుందట.
ఈ సినిమా పాన్ ఇండియా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో అప్పుడు నుంచి రానుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది అలాగే అడివి శేష్, కార్తీలు సాలిడ్ క్యామియోస్ లో నటించారు. అలాగే నానినే ఈ చిత్రానికి నిర్మాణం కూడా వహించిన సంగతి తెలిసిందే.