లేటెస్ట్ – 100 శాతం సీటింగ్ కు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

లేటెస్ట్ – 100 శాతం సీటింగ్ కు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

Published on Feb 5, 2021 12:00 PM IST

గత ఏడాది వచ్చిన కరోనాతో ఒక్కసారిగా సాధారణంగా ఉండే రోజులు అన్నీ ఎలా తలకిందులు అయ్యిపోయాయో తెలిసిందే. ఆ ధాటికి తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఇక ఏదైతేనేం మళ్ళీ ఎట్టకేలకు పరిస్థితులు మామూలుగా మారడం ప్రారంభం కావడంతో థియేటర్స్ కూడా తెరుచుకున్నాయి.

కాకపోతే కొన్ని ఆంక్షలతో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. గత కొన్ని రోజుల వరకు కూడా కేవలం 50 శాతం సీటింగ్ తోనే థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 100 శాతంకి అనుమతి కూడా ఇచ్చింది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అమలులోకి తీసుకొని రాలేదు.

అయితే అది కరోనా ప్రభావం మూలానే అలా చేసినా ఇప్పుడు తగ్గుతుండడంతో 100 శాతానికి కూడా అనుమతులు ఇస్తున్నారు. మరి అలా లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సీటింగ్ కు అనుమతులు జారీ చేసింది. దీనితో వీరు తీసుకున్న ఈ నిర్ణయానికి గాను సినీ ప్రేమికులు మరియు టాలీవుడ్ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు