రాముడిగా తారకరత్న

రాముడిగా తారకరత్న

Published on Apr 9, 2012 1:26 PM IST


నందమూరి తారకరత్న త్వరలో రాముడిగా కనిపించబోతున్నాడు. తన తరువాతి సినిమాలో చిన్న ఎపిసోడ్లో తారకరత్న రాముడిగా, అర్చన సీతగా కనిపించబోతున్నారు. శ్రద్ధా దాస్ మరో హీరొయిన్ గా కనిపించబోతుంది. ఈ నెల 15 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి వీరు కె దర్శకుడు. ఆర్ఎ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జిని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ నటుడు సుమన్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న ఈ సినిమాలో షాయాజీ షిండే మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటులు బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్ మరియు ఇతర నటులు కూడా నటించబోతున్నారు.

తాజా వార్తలు