రిజిస్టర్ అయిన ఆసక్తికరమైన టైటిల్స్ – ‘టపోరి’, ‘ఇత్తడి’

తాజాగా ఎ.పి ఫిల్మ్ చాంబర్ ఆమోదించిన సినిమా టైటిల్స్ లో రెండు టైటిల్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి ‘ఇత్తడి’ – ఈ సినిమాని ఆర్.జి.వి ఫిల్మ్ ఫాక్టరీ వారు రిజిస్టర్ చేసారు. ఇది ఏ సినిమాకి టైటిల్ గా వాడనున్నారు అనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు.

రెండవ టైటిల్ ‘టపోరి’. ఈ టైటిల్ ని బండ్ల గణేష్ గారి పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో ఎన్.టి.ఆర్ హీరోగా ‘బాద్ షా’, అల్లు అర్జున్ హీరోగా ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలను తీస్తున్నారు. మరి ‘టపోరి’ అనేది ఏ సినిమాకి టైటిల్ గా ఉపయోగించనున్నారో?

బండ్ల గణేష్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఓ సినిమా, అలాగే ప్రభాస్ తో ఓ సినిమా చేయనున్నారు. బహుశా ఈ రెండింటిలో ఒకదానికి ‘టపోరి’ అనే టైటిల్ ఉండే అవకాశం ఉంది.

Exit mobile version