అల్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్న తనికెళ్ళ భరణి

అల్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్న తనికెళ్ళ భరణి

Published on Oct 2, 2012 12:51 AM IST


ప్రముఖ హాస్య నటుడు తనికెళ్ళ భారానికి “అల్లు రామలింగయ్య జాతీయ హాస్యనటుడు అవార్డు” ని ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం,అల్లు అరవింద్ మరియు కొంతమంది సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఘంటా శ్రీనివాస రావు, వట్టి వసంత కుమార్ మరియు కొద్ది మంది రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవార్డును దివంగత హాస్యనటుడు శ్రీ అల్లురామలింగయ్య గారి స్మారకార్ధం బహుకరించారు. గతంలో ఈ అవార్డును డా బ్రహ్మానందం, బాలివుడ్ కమెడియన్ జాని లివర్, ఈ వి వి సత్యనారాయణ మరియు మనోరమాలు స్వీకరించారు. ఈ అవార్డు తనకి ఇచ్చినందుకు గాను కమిటీ వారికి తనికెళ్ళ భరణి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

తాజా వార్తలు