పవన్ సినిమా రీమేక్ పై ఆసక్తి చూపుతున్న తమిళ్ స్టార్స్

పవన్ సినిమా రీమేక్ పై ఆసక్తి చూపుతున్న తమిళ్ స్టార్స్

Published on Oct 3, 2013 5:30 PM IST

Attarintiki-Daredi-Posters-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పొరుగు రాష్ట్రాల సినిమా రంగం వాళ్ళు ఈ సినిమా పై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది తమిళ స్టార్ హీరోలు ఈ సినిమా రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా తెలుగు రీమేక్స్ చేసే హీరో ఈ సినిమా రైట్స్ ని దక్కించుకొని నటించే అవకాశం ఉంది.

‘అత్తారింటికి దారేది’ కథ మొత్తం అత్తయ్య అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. అత్తయ్య అనే బందుత్వానికి ఇండియన్ ఫ్యామిలీస్ లో ఎక్కువ విలువనిస్తారు. అందుకే ఈ సినిమాని వేరే భాష వాళ్ళు కూడా త్వరగా కనెక్ట్ అవుతారు కాబట్టి రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాలో అత్తయ్య పాత్రని నటి నదియా పోషించింది. తమిళ రీమేక్ లో కూడా ఆ పాత్ర చేయడానికి ఆమెనే తీసుకోవడానికి చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు