తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ‘DNA’ త్వరలో తెలుగులో ‘మై బేబి’గా విడుదలకు సిద్ధం

తమిళంలో ఇటీవల విడుదలైన డీఎన్‌ఏ సినిమా త్వరలో తెలుగులో ‘మై బేబి’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో July 11న విడుదల చేయనున్నారు. సురేష్ కొండేటి గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి సినిమాలను విడుదల చేశారు.

‘మై బేబి’ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కథలో హాస్పిటల్స్‌లో పిల్లల మాయం, వారిని వేరే చోట అమ్మడం వంటి సంఘటనలు ప్రధానంగా ఉంటాయి. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామా అంశాలతో రూపొందించబడింది.

Exit mobile version