దక్షిణాదిన తన అందంతో మనల్ని కట్టిపడేసే తారలలో తమన్నా ఒకరు. తెలుగులో అగ్ర తారగా వెలుగొందుతూ మిల్కీ బ్యూటీ గా పిలిపించుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ తన ఒంపు సొంపులను కోల్పోతుందట. వాటిని తిరిగి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
నేను బరువు తగ్గాలని అనుకుంటున్నా. దానికోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నా. నిజానికి ఇదే నా 2014 రిజల్యుషన్ అని తెలిపింది. నిజమే ఈ భామ ఇటీవల షాప్ ఓపెనింగ్స్ కి వచ్చినప్పుడు మనం ఈ మార్పును గమనించవచ్చు.
ప్రస్తుతం మహేష్ బాబుతో ఆగడు సినిమాలో నటిస్తుంది. ఈ భామను కిక్ 2 ప్రాజెక్ట్ కోసం సంప్రదించారని సమాచారం.