టాలీవుడ్, కోలీవుడ్ కుర్రాళ్ళను తన నడుమోంపులో కట్టిపడేసిన నటి తమన్నా. ఇటీవల ఈ భామ బాలీవుడ్ లో సైతం బాగా బిజీ అయిపోయి వరుసపెట్టి చిత్రాలు చేస్తుంది
ప్రస్తుతం ఈ భామ సాజిద్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘హమ్ షకల్స్’ సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ సరసన నటిస్తుంది. ఇటీవలే తన భర్త సైఫ్ ని చూడడానికి కరీనాకపూర్ ఈ చిత్ర షూటింగ్ సెట్స్ పైకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది
సెట్ లో ప్రతీ ఒక్కరితో మాట్లాడిన కరీనా ముఖ్యంగా తమన్నాని ఆకాలంలో యూత్ ఫుల్ గా వుండి యువత మనసుని కొల్లగొట్టిన తన అక్క కరిష్మా కపూర్ తో పోల్చిందట. తమన్నా ఇది పెద్ద కాంప్లిమెంట్ గా భావించడం ఆనందకరమైన విషయం.