మిల్కీ బ్యూటి తమన్నా నటించిన ‘హిమ్మత్ వాలా’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇది ఆమె బాలీవుడ్లో నటించిన మొదటి సినిమా కావడంతో తమన్నా కూడా ఈ సినిమా పై ఆశలు పెంచుకుంది. భారీ బడ్జెట్ తెరకెక్కిన హిమ్మత్ వాలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ రెస్పాన్స్ నమోదుచేసుకుంది. ఈ సినిమా ట్రైలర్స్, ఫొటోస్ చుసిన బాలీవుడ్ ఆమెకి విడుదలకి ముందే డేట్స్ కోసం వెంటపడుతున్నారు. తమిళ్, తెలుగు ఇండస్ట్రీ లని కొంత కాలం అగ్ర హీరోయిన్ గా ఏలిన తమన్నా బాలీవుడ్లో పాగా వేయబోతుంది. తమన్నా చివరిగా పవన్ కళ్యాణ్ తో ‘కెమెరామెన్ గంగాతో రాంబాబు’ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగచైతన్యతో కలిసి తమిళ్ వెట్టై రిమేక్ సినిమాలో నటిస్తున్నారు.