చికిరి ఫుల్ సాంగ్.. నెక్స్ట్ లెవెల్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కించిన అవైటెడ్ సినిమా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి చికిరి చికిరి అంటూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ జస్ట్ ప్రోమో తోనే సోషల్ మీడియా షేక్ చేసారు.

రామ్ చరణ్ హుక్ స్టెప్ ఆల్రెడీ ఓ రేంజ్ లో వైరల్ అవుతుండగా ఈ రానున్న ఫుల్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ చిన్న బిట్ జస్ట్ శాంపిల్ అయితే ఫుల్ సాంగ్ ఓ రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది అని తెలుస్తోంది. కేవలం రెహమాన్ సంగీతమే కాకుండా విజువల్ గా కూడా ఈ సాంగ్ చూసేందుకు ఎంతో బాగుంటుందట. సో రేపు 7న రానున్న ఫుల్ సాంగ్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.

Exit mobile version