కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రాల కేజీయఫ్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ కి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మంచి పాత్రలు చేసిన నటులు ఆ మధ్య కన్ను మూయడం ఎంతో విషాదంగా మారింది. అయితే ఇప్పుడు మరో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
ఈ రెండు సినిమాలలో కాశీమ్ చాచాగా మంచి ఎలివేషన్ సీన్స్ ఇచ్చిన నటుడు హరీష్ రాయ్ ఇప్పుడు లేరు. గత కొంతకాలంగా కాన్సర్ తో ఆయన బాధ పడుతుండగా దాని మూలాన వారు కన్ను మూసినట్టు ఇప్పుడు కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ వార్త విన్న నెటిజన్లు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.
