
ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న తన ఆఖరు చిత్రమే ‘జన నాయగన్”. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో రీసెంట్ గా పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో సినిమా వాయిదా అని కూడా వినిపించింది.
కానీ లేటెస్ట్ గా మేకర్స్ విజయ్ పై ఓ సాలిడ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసేసారు. దీనితో అనుకున్న టైం కి అంటే ఈ జనవరి 9నే థియేటర్స్ లో సినిమా పడనున్నట్టు తెలిపారు. ఇక పోస్టర్ లో కూడా విజయ్ మంచి మాస్ లుక్ లో కనిపిస్తుండగా టైటిల్ కి తగ్గట్టుగానే జన నాయకుడిలా చూపించడం విశేషం. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కె వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.