‘చికిరి చికిరి’ ఫుల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఊరమాస్ లుక్స్‌తో బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘చికిరి చికిరి’ అనే పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ పాట ప్రోమో ఇప్పటికే రిలీజ్ అవగా, దానికి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ ‘చికిరి చికిరి’ ఫుల్ సాంగ్‌ను నవంబర్ 7న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దీంతో ఈ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా.. ఈ పాటలో చరణ్ ఎలాంటి స్టెప్స్‌తో ఇరగదీస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version