మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా పట్ల గత కొన్నాళ్ల నుంచి పలు రూమర్స్ అలా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ లుక్స్ నుంచి షూటింగ్ వరకు పలు రూమర్స్ ఉన్నాయి.
కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ సినిమా చిత్ర యూనిట్ ఆ అన్ని రూమర్స్ కి ఒకేసారి చెక్ పెట్టేసారు. ప్రస్తుతం తారక్, పై ఓ కొత్త లుక్ ను ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ తో ప్రిపేర్ చేస్తుండగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గరుండి మానిటర్ చేస్తున్నాడు. ఇలా కొత్త లుక్ తో కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.
ఎన్టీఆర్ లోని బీస్ట్ మోడ్ చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. సో మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అలాగే రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారికి ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
