నూతన నటీనటులు బిమాల్ కార్తీక్ హీరోగా సంచిత పూనచా హీరోయిన్ గా జయంత్ గాలి నిర్మాణం మరియు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “లవ్ లైఫ్ & పకోడీ”. ఇప్పుడు ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను మేకర్స్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో అల్లు వారి హీరో అల్లు శిరీష్ చేతులు మీదుగా విడుదల చేశారు. మరి ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను చూస్తే కాస్త యూత్ ఫుల్ అనిపిస్తుందని చెప్పాలి.
లైఫ్ లో పెళ్లి లాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకుండా బ్యాచులర్ గా అమ్మాయిలతో ఒక్కో స్టేజ్ లో రిలేషన్ మైంటైన్ చేసే రోల్ లో హీరో కనిపిస్తున్నాడు. ఈ లైన్ కాస్త రొటీన్ గానే అనిపించినా హీరో హీరోయిన్స్ మధ్య ఎపిసోడ్స్ ను కాస్త ఇంట్రెస్టింగ్ గా డెవలప్ చేసినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా ఒక ప్లెసెంట్ మూడ్ లో సింపుల్ అండ్ నీట్ గా కొనసాగే దానిలా ఇది అనిపిస్తుంది.
ఏ టైప్ లో అంటే ఒక తరుణ్ భాస్కర్ సినిమాల్లా అలాగే లేటెస్ట్ “కృష్ణ అండ్ హిస్ లీల” టైప్ లో ఆకట్టుకుంటుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సిచుయేషనల్ కామెడీ సీన్స్ పవన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమాలో అతని వర్క్ బహుశా హైలైట్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి వచ్చే మార్చ్ 12న విడుదల కానున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి