‘ఓజి’కి ఇంట్రెస్టింగ్ ఛేంజ్?

‘ఓజి’కి ఇంట్రెస్టింగ్ ఛేంజ్?

Published on May 13, 2025 8:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తర్వాత పవన్ డేట్స్ లేక ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక మళ్ళీ ఫైనల్ గా పవన్ డేట్స్ ఇచ్చేసరికి ఈ సినిమా పునః ప్రారంభం కాగా ఈ షూటింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ ఛేంజ్ తో మొదలైనట్టుగా తెలుస్తుంది.

ఇది వరకు ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకులు రవి కె చంద్రన్ పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు తనని మరో ప్రముఖ ఛాయాగ్రాహకులు మనోజ్ పరమహంస భర్తీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది పవన్ కళ్యాణ్ సినిమాలకి కొత్తేమి కాదని చెప్పాలి. గతంలో కూడా పలు చిత్రాలకి అందించే బృందం మారారు. ఇక మనోజ్ అందించే విజువల్స్ ఓజి కి ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు