స్క్రిప్ట్ పూర్తి చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ !

స్క్రిప్ట్ పూర్తి చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ !

Published on Jun 21, 2020 10:51 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ‘సందీప్ వంగ’ హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో అర్జున్ రెడ్డి రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఏకంగా బాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట. అయితే హిందీ నిర్మాతలు సందీప్ సినిమాకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట.

‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఇక సందీప్ తరువాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అని, క్రైమ్ డ్రామాగా ఉండనుందని తెలుస్తోంది.

తాజా వార్తలు