మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హీరో నితిన్ హీరోగా రీమేక్ కాబోతుంది బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’. కాగా ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో ఆయుష్మాన్ ఖురాన్ నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ కూడా కీలకమైనదే. అయితే టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ, ప్రియమణి, శ్రియా లాంటి మాజీ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కాగా ఫిల్మ్ సర్కిల్స్ లో తాజా టాక్ ఏమిటంటే, టబు ఈ రీమేక్ లో నటించడానికి అంగీకరించదని తెలుస్తోంది. కాకపోతే ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట.
టబుది ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో టబు భారీగా రెమ్యునిరేషన్ అడుగుతుందట. కాగా ఈ చిత్రంలో నటించడానికి టబుకు పెద్ద మొత్తంలోనే రెమ్యునిరేషన్ ఇవ్వటానికి మేకర్స్ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇక నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్ ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమాలను చేస్తున్నారు.