కలర్స్ స్వాతి మరియు అర్చన కవి హీరోయిన్లుగా ‘123’

కలర్స్ స్వాతి మరియు అర్చన కవి హీరోయిన్లుగా ‘123’

Published on Sep 30, 2012 2:01 PM IST


గతంలో ‘స్నేహ గీతం’ మరియు ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుర శ్రీధర్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘123’. 1. లైఫ్, 2. లవ్, 3. హార్ట్స్ అనే ఉపశీర్షిక తో తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ 11న సెట్స్ పైకి వెళ్లనుంది. అజిత్ నటించిన ‘గ్యాంబ్లర్’ చిత్రంలో సహాయ నటుడిగానటించిన మహత్ రాఘవేంద్ర ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కలర్స్ స్వాతి మరియు మలయాళీ భామ అర్చన కవి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ మొదటిసారిగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి చిత్రీకరించనున్నారు. ఎం.వి.కె రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, పి. జి విందా సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

తాజా వార్తలు