నిఖిల్ మరియు స్వాతి ప్రధాన పాత్రలలో రానున్న “స్వామి రారా” చిత్ర ఆడియో జనవరి 23న విడుదల కానుంది. ఈ చిత్రంతో సుదీర్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్ర కథ మొత్తం దొంగలింపబడిన వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో రవి బాబు కీలక పాత్ర పోషించగా పూజ రామ చంద్రన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. “స్వామి రా రా చిత్ర ఆడియో జనవరి 23న విడుదల చేయ్యనున్నాము ఈ కార్యక్రమం లైవ్ గా టివి చానల్స్ లో రానుంది” అని నిఖిల్ అన్నారు. ఈ చిత్రానికి సున్నీ సంగీతం అందించగా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు.