కృష్ణాలో కలెక్షన్స్ అదరగొడుతున్న ‘సీతమ్మ వాకిట్లో..’

SVSC New Posters (3)

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అన్ని ఎరియాల్లోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది, అలాగే కృష్ణా జిల్లాలో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ సినిమా విడుదలైన 5 వరోజు (అనగా జనవరి 15న) మాత్రమే 33.42 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా మొత్తంగా 1.53 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సి సెంటర్లలో ఆదరణ ఊపందుకుంది. ఇకనుంచి కలెక్షన్స్ కూడా జోరందుకునే అవకాశం ఉంది.

టాలీవుడ్ టాప్ హీరోలైన విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా ఈ సినిమాలో కనిపించడంతో అందరూ స్క్రీన్ పై ఒకేసారి వారిద్దరినీ చూడటానికి థియేటర్లకు ఎగబడుతున్నారు. సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version