రామానాయుడు స్టూడియోలో వెంకీ – మహేష్ సినిమా షూటింగ్

రామానాయుడు స్టూడియోలో వెంకీ – మహేష్ సినిమా షూటింగ్

Published on Oct 2, 2012 8:24 AM IST


విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ చిత్రానికి సంభందించిన కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండి రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలి ఉందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇంకా రెండు పాటలు కూడా షూటింగ్ మిగిలి ఉంది. మహేష్ బాబుకి సరసన సమంతా నటిస్తుండగా వెంకటేష్ కి జోడీగా అంజలి నటిస్తుంది. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఆడియోని నవంబరు మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దిల్ రాజు అన్నారు.

తాజా వార్తలు