వారిద్దరూ స్టార్ హీరోలు. ఒకరు సీనియర్ స్టార్ హీరో అయితే మరొకరు ఈ తరం సూపర్ స్టార్ హీరో. సాధారణంగా వారిద్దరి సినిమాలు సోలోగా విడుదల అయినపుడే రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. మరి వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో కలిసి నటిస్తే రికార్డు హద్దు లేకుండా చెలరేగిపోతారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరూ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ మల్టీస్టార్టర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కృష్ణా జిల్లా హక్కులు రికార్డు స్థాయిలో 2 కోట్ల 75 లక్షల రూపాయలకి అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ ఏరియాలో ఇదే అత్యధిక మొత్తం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఎట్టి పరిస్తుతుల్లోను డిసెంబర్ 21న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోలో జరుగుతున్నాయి.