భారీ అంచనాలు నెలకొన్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. బెనిఫిట్ షోలు, ప్రీఎమియర్ షోలు పలుచోట్ల మొదలయ్యాయ, ఈ షోల నుంచి వస్తున్న రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. ఈ సినిమా చూసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. వారెమన్నారో వారి మాటల్లోనే …
అనిల్ సుంకర – ‘దూకుడు’ నిర్మాత, ‘యాక్షన్ 3డి’ డైరెక్టర్ : ” ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. వెంకటేష్ – మహేష్ బాబుల మధ్య అన్నదమ్ముల కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంది’.
గోపి మోహన్ – ప్రముఖ తెలుగు సినిమా కథా రచయిత : ” ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్నదమ్ముల అనుబంధంతో తెరకెక్కిన క్లాస్ మూవీ, తప్పకుండా చూడాల్సిన సినిమా”.
రామజోగయ్య శాస్త్రి – ప్రముఖ పాటల రచయిత ; ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. 2013లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వితీయ యజ్ఞంని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది’.
పండుగ సందర్భంగా భారీ క్రేజ్ తో ఉన్న ఈ సినిమాని భారీ ఓపెనింగ్స్ తో భారీ ఎత్తున రిలీజ్ చేసారు.