డబ్బింగ్ పూజ జరుపుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

డబ్బింగ్ పూజ జరుపుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

Published on Oct 5, 2012 2:20 PM IST


మహేష్ బాబు మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఈరోజు లాంచనంగా పూజ నిర్వహించారు. అటు నిర్మాణం ఇటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ఈ చిత్రం ఒకేసారి జరుపుకుంటుంది. ఈ చిత్రం డిసెంబర్లో విడుదలకి సిద్దమవుతుంది. ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ముల పాత్రలలో కనిపించనున్నారు సమంత మరియు అంజలి కథానాయికలుగా కనిపించనున్నారు. మిక్కి జే మేయర్ అందించిన సంగీతం వచ్చే నెల విడుదల అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు