ప్రారంభమయిన సుశాంత్,శాన్విల “అడ్డా” చిత్రం


సుశాంత్, శాన్విలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “అడ్డా” ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంది. సాయి కార్తిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ నాగ కార్పోరేషన్ బ్యానర్ మీద నాగసుశీల, చింతలపూడి శ్రీనివాస రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, అమల, పూరి జగన్నాథ్, నాగ చైతన్య, అఖిల్, నాగ సుశీల ఈ చిత్ర ప్రారంభంలో పాల్గొన్నారు. నాగార్జున క్లాప్ కొత్తగా అక్కినేని నాగేశ్వర రావు కెమరా ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ” ఈ కథ మీద నేను దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పని చేశాను ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు 70 మంది విమర్శకుల అభిప్రాయాలను సేకరించాము. ఈ చిత్రం ఒక యాక్షన్ లవ్ స్టొరీ. ఈ చిత్రం మంచి చిత్రం అవుతుందని మాకు నమ్మకముంది.” అని దర్శకుడు సాయి కార్తిక్ చెప్పారు. సుశాంత్ దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత ఈ చిత్రంతో తిరిగి తెర మీదకి రానున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Exit mobile version