సుశాంత్ సింగ్ ఆత్మ హత్య అందరినీ షాక్ కి గురిచేయగా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ అభిమాని సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆత్మ హత్య కూడా చేసుకున్నారు. సుశాంత్ ఆత్మ హత్యపై బాలీవుడ్ లో పెద్ద వివాదమే నదిస్తుండగా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఓ డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ చివరి చిత్రం దిల్ బిచారా. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
కాగా ఈ చిత్ర నిర్మాతలు ఈ మూవీని ఓ టి టి లో విడుదల చేయాలని భావిస్తున్నారు. థియేటర్స్ బంధ్ నేపథ్యంలో మేకర్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఐతే ఫ్యాన్స్ మాత్రం దిల్ బిచారా మూవీని థియేటర్స్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు. వారు హీరో సుశాంత్ కి థియేటర్స్ లో గట్టిగా నివాళులు తెలపాలి అని భావిస్తున్నారు. తమ అభిమాన హీరో మొదటి సినిమా థియేటర్స్ లో చూసి ఘననివాళి పలకాలని వారి ఆలోచన.